యాదగిరిగుట్ట, వెలుగు: శ్రావణ శుక్రవారం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో దోర్భల భాస్కర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి వ్రతాలను ప్రారంభించారు.
200 మంది మహిళలు సామూహిక వ్రతంలో పాల్గొన్నారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా సమకూర్చారు. వ్రతాలు ముగిసిన అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ఏఈవోలు జూశెట్టి కృష్ణ, గజవెల్లి రఘు పాల్గొన్నారు.
