సర్కారీ టీచర్ల సింగపూర్ సవారీ.. 

సర్కారీ టీచర్ల సింగపూర్ సవారీ.. 
  • వచ్చే నెల 12 నుంచి 19 వరకు ఎడ్యుకేషనల్ టూర్
  • తొలి బ్యాచ్లో 29 మంది టీచర్లు, హెచ్ఎంల ఎంపిక
  • గ్లోబల్ మెథడ్స్ నేర్చుకునేందుకు విదేశాలకు పంపుతున్న సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన 'టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ ప్రోగ్రామ్'లో భాగంగా టీచర్లకు సింగపూర్ వెళ్లనున్నారు. విదేశాల్లో అమలవుతున్న ఉత్తమ బోధనా పద్ధతులను పరిశీలించి.. వాటిని మన దగ్గర అమలు చేసేందుకు వీలుగా టీచర్లు, అధికారులను విదేశాల కు పంపేందుకు విద్యాశాఖ రెడీ అయింది.

ఇందులో భాగంగా సింగపూర్ వెళ్లే తొలి బ్యాచ్కు సంబంధిం చిన 29 మంది టీచర్ల లిస్టును స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ విడుదల చేశారు. ఈ విద్యా పర్యటన సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పాల్గొం టారు.టూర్ కు ఎంపికైన టీచర్లకు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు.

ఎంపికైన టీచర్లు వీరే..

ఆర్. శ్రీనివాస్ (యాదాద్రి భువనగిరి), టి. మురళీకృ ష్ణ మూర్తి (మేడ్చల్ మల్కాజిగిరి), గోశికొండ నరేశ్ (నిజామాబాద్), ఎ. లక్ష్మి (మహబూబ్ నగర్), వైట్ల వాణి (హన్మకొండ), ఆకుల పద్మలత (భద్రాద్రి కొత్త గూడెం), బండారి సుమలత (కామారెడ్డి), సీహెచ్ కృష్ణారెడ్డి (వరంగల్), జోగ రవి (జగిత్యాల), పాసం శ్రీనివాసరావు (ఖమ్మం), టి. రాజశేఖర్ రావు (నాగర్ కర్నూల్), వి. రాజేశ్ (ఆసిఫాబాద్), జీవీఆర్ రాజేశ్వ రి (మేడ్చల్), పార్చ సత్య శ్రీదేవి (భద్రాద్రి కొత్తగూ డెం), తీగల శ్రీవిద్య (నల్గొండ), వైఎన్ సువర్ణ లక్ష్మి (రంగారెడ్డి).

ముల్లాపాటి శైలజ (మెదక్), మదారి ఎల్లన్న (నిర్మల్), ఎస్.వంశీ (పెద్దపల్లి), టి. రాజేశ్ కుమార్ (ములుగు), తోటమ్ స్వామి (జయశంకర్ భూపాలపల్లి), సహీద్ ఫాతిమా (కామారెడ్డి), అడ్లూరి లావణ్య (కుమ్రంభీం ఆసిఫాబాద్), కె. శ్రీలక్ష్మి (రం గారెడ్డి), వుప్పు మంగతాయమ్మ (సూర్యాపేట), షేక్ లాల్బీ (భద్రాద్రి కొత్తగూడెం), ఎ. చేతన ప్రియ (నాగర్ కర్నూల్), కోడిపాక రమేష్ (హన్మకొండ), బి. నాగరాజు (వికారాబాద్) ఎంపికయ్యారు