హైదరాబాద్: హైదరాబాద్లో జాబ్ కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆగస్టు 24న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాసబ్ ట్యాంక్‌లోని ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాపై నిర్వాహకుడు మన్నన్ ఖాన్ మాట్లాడుతూ..ఈ జాబ్ ఫెయిర్‌లో అనేక కంపెనీలు పాల్గొని, ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ రంగాలలో జాబ్స్లోకి తీసుకుంటారని చెప్పారు.
వీటిల్లో.. కొన్ని కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ కూడా అవకాశం కూడా ఇస్తాయని తెలిపారు. కనీస విద్యార్హత టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంటర్వ్యూలు ఫంక్షన్ హాల్‌లోనే నిర్వహిస్తారు. ప్రవేశం ఉచితం. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధంగా ఉంటే.. మరిన్ని వివరాల కోసం 8374315052 నంబరును సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
