హైదరాబాద్లో జెప్టో, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్లో ఆర్డర్ చేస్తున్నారా..? అయితే ఒక్కసారి ఈ ముచ్చటేందో చూడండి !

హైదరాబాద్లో జెప్టో, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్లో ఆర్డర్ చేస్తున్నారా..? అయితే ఒక్కసారి ఈ ముచ్చటేందో చూడండి !

హైదరాబాద్: జెప్టో, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ డార్క్ స్టోర్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. హైదరాబాద్‌ CURE ప్రాంతంలో 29 డార్క్ స్టోర్లలో తనిఖీలు చేసింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో 10 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. పలు స్టోర్లలో అపరిశుభ్రత, ఆహార నిల్వల్లో నిబంధనల ఉల్లంఘనలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తించారు. ఫంగస్ సోకిన కుళ్లిన కూరగాయలను గుర్తించారు. ఆహార పదార్థాల హ్యాండ్లింగ్, స్టోరేజీలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు తేల్చారు.

FSSAI లేబులింగ్, డిస్‌ప్లే నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించారు. డార్క్ స్టోర్లలో ఎలుకల బెడదను గుర్తించారు. కల్తీ అనుమానంతో 29 ఆహార నమూనాలు సేకరించారు. 4 లైసెన్సులు సస్పెండ్ చేశారు. వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 12 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ, 9 షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సంస్థల డార్క్ స్టోర్లపై TG SAFE నిఘా పెట్టింది.