మన దేశం అభివృద్దిలో ప్రపంచంతో పోటీపడుతోంది.. త్వరలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తోంది.. అయితే రెండు పూటలా తిండి దొరకని వారు కూడా ఉన్నారు. కేవలం కడుపు నింపుకునేందుకు ఏదో ఒకటి తింటున్న దీన స్థితిలో ఉన్నారు. కూలీలు పచ్చిమిర్చి, ఉప్పుతో కలిపి రోటీ తింటున్న వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఎమోషనల్ గా స్పందిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. రైలులో కొంత మంది కూలీలు ఫ్లోర్ పైన కూర్చొని పచ్చిమిర్చి, ఉప్పుతో రొట్టెలు తింటున్నారు. కనీసం తినేందుకు కూర కూడా లేని దుస్థితి. కేవలం కడుపు నింపుకునేందుకు ఇలా ఏదో ఒకటి తినేస్తున్నారు. కొందరు రుచులకోసం వెతుకుతున్న క్రమంలో ఇలా అరకొర తిండితో కడుపునింపుకుంటున్న తీరు ఇంటర్నెట్ లో చర్చనీయాంశమైంది.
ఈ వీడియో చూసినవారంతా ఎమోషనల్ గా స్పందించారు. ఇప్పటికీ మన దేశంలో ఈ పరిస్థితి ఉండటం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తున్నాం..అయినా ఇలా వారు కూడా రెండు పూటల తిండి దొరకడం అంటే పెద్ద విషయమే. కొంతమంది రుచులకోసం వెతుకుతున్నారు.. తమ ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒకటి తింటున్న పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఉప్పు, కారంతో రొట్టెలు తినవలసి వచ్చేంతటి పేదరికాన్ని దేవుడు ఎవ్వరికీ ఇవ్వకూడదని’’ కామెంట్ చేశారు.
ఇంకో నెటిజన్ .. ‘‘ మన దేశంలో కొంతమందికి రెండు పూటలా ఉప్పు, రొట్టె తినడం కూడా చాలా పెద్ద విషయమే ’’ అని రాశారు.
మరొక నెటిజన్ స్పందిస్తూ.. కొంతమంది రుచిని చూస్తారు.. వీళ్లు కేవలం తమ ఆకలిని మాత్రమే తీర్చుకుంటారని సానుభూతి చూపిస్తూ పోస్ట్ షేర్ చేశారు.
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా మన దేశంలో వలసలు, ఆకలి కేకలు ఇంకా అలాగే ఉన్నాయి. పేదల జీవితం నిజంగా చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేస్తూ రాశారు. వైరల్ అవుతున్న ఈ వీడియాతో మన దేశంలో ప్రస్తుత పరిస్థితులపై పెద్ద చర్చకు దారి తీసింది.
వైరల్ అవుతున్న ఈ వీడియో.. దేశంలో పేదరికం, ఆహార భద్రత, వలస కార్మికుల జీవన పరిస్థితులపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది. అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవనం, కనీస ఆహార భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది.
