దేశంలోని ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్బీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్బీఓ).
మొత్తం ఖాళీలు: 2482.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 ఖాళీలు ఉన్నాయి. (ఎస్సీ 12, ఎస్టీ 5, ఓబీసీ 22, ఈడబ్ల్యూఎస్ 8, జనరల్ 33).
తెలంగాణ రాష్ట్రంలో 50 ఖాళీలు ఉన్నాయి. (ఎస్సీ 8, ఎస్టీ 3, ఓబీసీ 14, ఈడబ్ల్యూఎస్ 5, జనరల్ 20).
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిధిలోని ఏదైనా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులో ఆఫీసర్‌గా కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
ఐసీ 38 (ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), ఎన్ఐఎస్ఎం సిరీస్ V-A (మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్), ఎన్ఐఎస్ఎం సిరీస్ XXI-A (పీఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్), ఎన్ఐఎస్ఎం సిరీస్ XIII (కామన్ డెరివేటివ్స్) సర్టిఫికెట్ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో కచ్చితంగా ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 18.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ. 850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 7.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.bankofbaroda.bank.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. 120 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్షన్–1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, సెక్షన్–2లో బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్/ ఎకనమిక్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఇస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ సెక్షన్ కేవలం అర్హత కోసమే. ఇందులో సాధించిన మార్కులను తుది మెరిట్ జాబితా తయారీకి పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
కనీస అర్హత మార్కులు: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో జనరల్ అభ్యర్థులకు 60 శాతం, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 55 శాతం కనీస అర్హత మార్కులు రావాలి.
స్థానిక భాషా పరీక్ష: అభ్యర్థులు 10వ తరగతి లేదా 12వ తరగతి స్థాయిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నట్లయితే మినహాయింపు ఉంటుంది. లేనివారు కచ్చితంగా స్థానిక భాషా ప్రావీణ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
