దసరా సెలవులు ప్రారంభం కావడంతో పట్టణవాసులు పల్లెల బాట పట్టారు. దీంతో నల్లగొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మొదలైంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రహదారులు రద్దీగా మారుతున్నాయి.
వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ప్లాజా యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాల రాకపోకలను వేగవంతం చేసేందుకు నాలుగు టోల్ బూతులను తెరిచి, సిబ్బంది వాహనాలను పంపిస్తున్నారు.
దసరా సెలవుల నేపథ్యంలో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, రహదారి నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
