హైదరాబాద్‌ సీ-డాక్‌లో 844 ఉద్యోగాలు.. ఇంజినీర్, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేయండి!

 హైదరాబాద్‌ సీ-డాక్‌లో 844 ఉద్యోగాలు.. ఇంజినీర్, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేయండి!

కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డెవ లప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి- డాక్) దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 11 సీడాక్ కేంద్రాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 26 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యూల్ లీడ్, టెక్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్, సపోర్ట్ రోల్స్ (హెచ్ఎర్/అడ్మిన్, ఫైనాన్స్, పర్చేజ్, టెక్నీషియన్).

మొత్తం ఖాళీలు: 844.

కేంద్రాల వారీగా ఖాళీలు: నోయిడా 207, పుణె 142, తిరువనంతపురం 118. గువాహతి 88, చెన్నై 88, బెంగళూరు 58, మోహాలి 55, హైదరాబాద్ 46, ముంబయి 20, కోల్కతా 19, ఢిల్లీ 1.

పోస్టుల వారీగా విద్యార్హతలు
ప్రాజెక్ట్ అసోసియేట్: కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఈఈఈ లేదా సమాన రంగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ / బి.టెక్ లేదా ఎంఈ /ఎం.టెక్ లేదా సమాన పీజీడిగ్రీ / ఎంసీఏపూర్తిచేసి ఉండాలి.

ప్రాజెక్ట్ ఇంజినీర్: కనీసం 60శాతం మార్కులతో బీఈ/బి.టెక్ లేదా ఎంఈ/ఎం.టెక్కలిగి ఉండాలి. కొన్ని విభాగాలకు సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో పీజీతోపాటు అనుభవం ఉండాలి.సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ టెక్ లీడ్ బీఈ / బి.టెక్ / ఎంఈ/ ఎం.టెక్ లేదా పీహెచ్డీతోపాటు సంబంధిత రంగంలో కనీసం 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

ప్రాజెక్ట్ మేనేజర్: సంబంధిత టెక్నికల్ రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండి సిస్టమ్ ఆర్కిటెక్చర్ లేదా లార్జ్స్కల్ ప్రాజెక్టుల నిర్వహణలో దీర్ఘకాలిక అనుభవం ఉండాలి.

వయసు: పోస్టులను అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

లాస్ట్ డేట్: అక్టోబర్ 26.

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులు ఆన్లైన్లో సమర్పిం చిన దరఖాస్తులను, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా పరిశీలించి షార్ట్ లిస్ట్  చేస్తారు.

రాత పరీక్ష /స్కిల్ టెస్ట్: కొన్ని నిర్దిష్ట పోస్టులకు లేదా ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు టెక్నికల్ స్కిల్స్. ఆప్టిట్యూడ్ లేదా కోడింగ్ సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి ఆన్లైన్ రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ అయిన లేదా రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వ హిస్తారు. అభ్యర్థుల సాంకేతిక పరిజ్ఞానం, ప్రాజెక్ట్ అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

మరిన్ని వివరాలకు వెబ్సైట్ careers.cdac.inను సందర్శించండి.