503/9 వద్ద భారత్ డిక్లేర్.. 8 పరుగులకే లంక 2 వికెట్లు డౌన్.. రెండో రోజు టీమిండియా డామినేషన్

503/9 వద్ద భారత్ డిక్లేర్.. 8 పరుగులకే లంక 2 వికెట్లు డౌన్.. రెండో రోజు టీమిండియా డామినేషన్

IND vs SL 2nd Test: కొలంబో టెస్టు రెండో రోజు ఆటలో డ్రామా నెక్ట్స్ లెవెల్‌కి చేరింది. 300/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాటర్లు లంక బౌలర్లకు నరకం చూపించారు. సారాంశ జైన్ త్వరగానే అవుట్ అయినా, తొలిరోజు రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన రిషభ్ పంత్ రీ-ఎంట్రీ ఇచ్చి మాస్ వైబ్స్ తెచ్చాడు. 89 బంతుల్లో 63 రన్స్ కొట్టి లంక బౌలింగ్‌ను రఫ్ఫాడించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) తన కెరీర్‌లో 2వ టెస్ట్ సెంచరీతో చెలరేగడంతో ఇండియా 503/9 భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4 వికెట్లు తీసినా, భారత బ్యాటర్ల విధ్వంసానికి స్కోరు బోర్డు హీటెక్కిపోయింది.

బ్యాటింగ్ లో దుమ్మురేపిన జురెల్: 

95 పరుగుల దగ్గర వర్షం బ్రేక్ ఇవ్వగా, మ్యాచ్ పునఃప్రారంభమైన తర్వాత 99 పరుగుల దగ్గర రనౌట్ గండం నుంచి తృటిలో ఎస్కేప్ అయిన ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) బాధ్యతాయుతమైన సెంచరీతో రచ్చ లేపాడు. తన రెండో టెస్టు శతకంతో భారత్‌ను ఏకంగా 503/9 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేలా నిలబెట్టాడు. ప్రస్తుతం ప్రసిద్ కృష్ణ (4 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ ముగించిన జురెల్ పర్‌ఫార్మెన్స్‌పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

3 ఓవర్లకే 2 వికెట్లు గోవిందా.. క్రీజులో లంక గిలగిల: 

భారత్ 503 పరుగుల భారీ స్కోరు దగ్గర డిక్లేర్ చేశాక బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు వచ్చి రాగానే షాక్ మీద షాక్ ఇచ్చారు. కేవలం 3 ఓవర్లలోనే లాహిరు ఉదారాను ప్రసిద్ కృష్ణ పెవిలియన్ పంపించేశాడు. ఆ వెంటనే నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యను మానవ్ సుతార్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక 8/2తో తీవ్ర కష్టాల్లో పడిపోయింది.

వెలుతురు లేదు బాబోయ్.. లంక ఫ్రస్ట్రేషన్ పీక్స్:

ఆట చివర్లో భారత బౌలర్లు వికెట్లు తీస్తూ కంప్లీట్ డామినేషన్ చూపిస్తుంటే, శ్రీలంక బ్యాటర్లు మాత్రం అంపైర్ గారూ.. బ్యాటింగ్ చేయడానికి అసలు వెలుతురే (Bad Light) లేదు అంటూ ఫ్రస్ట్రేట్ అయిపోయారు. కానీ ఆట ముగిసేసరికి 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి, ఇంకా 495 పరుగులు వెనుకబడి ఉండటంతో లంక క్యాంప్‌లో అలజడి మొదలైంది. మరీ మూడో రోజు ఆటలో మనోళ్లు మరిన్ని వికెట్లు తీసి లంకను ఎలా ప్యాకప్ చేస్తారో చూడాల్సి ఉంది.