మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలపై తొలిసారి నోరు విప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు జర్నలిస్టులు.
కాంగ్రెస్ పార్టీకి అందరూ విదేయతగా ఉండాలని.. పార్టీ లైన్ ఎవరు దాటినా.. ఆ విషయాన్ని క్రమ శిక్షణ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఊహాజనితమైన వార్తలు రాయొద్దని మీడియాకు సూచించారాయన. నాతో సహా ఎవరైనా సరే పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. పార్టీ లైన్ దాటిన వాళ్లను ఏం చేయాలి అనేది క్రమ శిక్షణ కమిటీ చూసుకుంటుందని వివరించారు.
మంత్రి కొండా సురేఖ విషయం పార్టీ అధిష్టానం, ఏఐసీసీ చూసుకుంటుందని.. పార్టీ అంతర్గత వ్యవహారాలను ప్రభుత్వ వేదికలపై స్పందించకూడదన్నారు. పార్టీలో అందరూ క్రమ శిక్షణకు కట్టుబడి ఉండాలని.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు సీఎం రేవంత్.
