కుకింగ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా: క్యాన్లు, డబ్బాలతో ఎగబడ్డ జనం.. పోలీసులు వచ్చేదాకా రచ్చ రచ్చ!

కుకింగ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా: క్యాన్లు, డబ్బాలతో ఎగబడ్డ జనం.. పోలీసులు వచ్చేదాకా రచ్చ రచ్చ!

మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఒక రిఫైన్డ్ కుకింగ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దింతో రోడ్డుపై వంట నూనె భారీగా కారిపోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు కలకలం రేగింది.

ఈ ప్రమాదం జరిగాక... వంట నూనె ధరలు ఎక్కువగా ఉండటంతో, లీక్ అవుతున్న నూనెను చూసి పట్టుకోవడానికి చుట్టుపక్కల జనాలు బకెట్లు, డబ్బాలు, క్యాన్లు పట్టుకుని ఘటనా స్థలానికి పరుగు పెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జనాలు వంట నూనెను తీసుకెళ్లకుండా అక్కడి గుంపును చెదరగొట్టారు.

 రోడ్డు పాలైన నూనె వల్ల భారీగా ఆర్థిక నష్టం కాగా.... అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే పై ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ అయింది.

ALSO READ : 40 లక్షల కారులో వచ్చి రోడ్లు ఊడుస్తున్న కార్మికుడు

గతంలో ఇదే తరహా ఘటన:
గత నెల జూలై 27న మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా NH-46 రోడ్డుపై ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది.  డ్రైవర్ వాహనం పై కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరగ్గా...  అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దింతో చుట్టుపక్కల గ్రామస్తులు డీజిల్ కోసం పోటీ పడగా,  
డీజిల్ అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తూ, పోలీసులు జనాలను అక్కడి నుంచి పంపించివేశారు.