40 లక్షల కారులో వచ్చి రోడ్లు ఊడుస్తున్న కార్మికుడు : ఎవరికో బినామీ అనుకుంటున్నారా.. అసలు నిజం ఇదే..

40 లక్షల కారులో వచ్చి రోడ్లు ఊడుస్తున్న కార్మికుడు : ఎవరికో బినామీ అనుకుంటున్నారా.. అసలు నిజం ఇదే..

పెద్ద సారు మాదిరి పెద్ద కారులో వచ్చాడు.. ఆ కారు ధర 40 లక్షల రూపాయలు.. ఇంత పెద్ద కారులో ఆఫీసుకు వచ్చాడు అంటే.. ఎవరైనా ఏమనుకుంటున్నారు.. పెద్ద సారు అనుకుంటారు కదా.. ఇతను మాత్రం 40 లక్షల కారులో వచ్చాడు.. వచ్చీ రాగానే చీపురు తీసుకున్నాడు. రోడ్లు మొత్తం ఊడ్చాడు.. మధ్యాహ్నం 12 గంటలు కాగానే... తన 40 లక్షల కారులో ఎంచక్కా ఇంటికి వెళ్లిపోయాడు.. ఇతను ఎవరో తెలుసా.. ఓ పారిశుధ్య కార్మికుడు.. రోడ్లు ఊడ్చడం ఇతడి పని.. ఇలాంటి కార్మికుడిని 40 లక్షల కారు ఏంటీ.. ఇతను ఏమైనా అధికారికి.. ప్రజాప్రతినిధికి బినామీ అయ్యి ఉంటాడు.. లంచం డబ్బులు తన దగ్గర పెట్టుకున్న బినామీ అయ్యి ఉంటాడు అని అందరూ అనుకుంటున్నారు.. అసలు నిజం ఏంటో తెలుసా.. ఈ స్టోరీ మొత్తం చదవండి..

అతడి పేరు శేషప్పణ్ణ... కర్ణాటకలోని బంట్వాళలో పారిశుధ్య కార్మికుడు.1996లో రూ.50 కూలి కోసం పారిశుధ్య కార్మికుడిగా చేరాడు... కొంతకాలానికి పర్మినెంట్ ఉద్యోగి అయ్యాడు. ఆ తర్వాత తాగుడు  బానిసయ్యాడు శేషప్పణ్ణ. 2005లో  బంట్వాళ ఎస్‌ఐ బెళ్ళియప్ప మాటలతో మద్యం వదిలేశాడు. రోజూ మాద్యహ్నం వరకుస్వీపర్ గా పనిచేసే శేషప్పణ్ణ ఆ తర్వాత పశువుల పెంపకం మొదలు పెట్టాడు. దీంతో నెలకు 40 వేలు అదనంగా సంపాదిస్తున్నాడు.

ఈ క్రమంలో మొదట ఆల్టో కారు కొన్నాడు శేషప్పణ్ణ... అప్పుడు అందరు స్వీపర్ కి కారెందుకు అంటూ ఎగతాళి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు అది అమ్మేసి స్కార్పియో కొన్నాడు. మళ్ళీ అది అమ్మేసి బ్యాంకు లోన్ తీసుకొని ఫార్చూనర్ కారు కొన్నాడు. ఫార్చూనర్ కారులో వచ్చి రోడ్లు ఊడ్చుతున్న ఇతన్ని చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

జీవితంలో ఎన్నో తప్పులు చేశానని..మద్యానికి బానిసై ఎన్నో కోల్పోయానని... తండ్రి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని స్థితికి వెళ్లానని అన్నాడు శేషప్పణ్ణ. పారిశుధ్య కార్మికుడిగా వచ్చే జీతంతో పాటు పశువుల పెంపకం ద్వారా మరి రూ.40 వేలు సంపాదిస్తాన్నానని.. నాకు ఇష్టమైన కారులో తిరగడం సంతోషంగా ఉందని అంటున్నాడు శేషప్పణ్ణ. ఏ పని చేస్తున్నామనేది ముఖ్యం కాదని..గౌరవం ముఖ్యమని అంటున్నాడు.