Kartik Tyagi: యూపీ టీ20 లీగ్ (UP T20 League) చూడటానికి వెళ్లే ప్రేక్షకులు ఇప్పుడు బౌలింగ్ చూడటానికి కాదు, కార్తీక్ త్యాగి విసిరే బంతులు ఎక్కడ వచ్చి పడతాయో అని హెల్మెట్లు పట్టుకుని కూర్చోవాల్సి వస్తోంది. మీరట్ మావరిక్స్ తరఫున బౌలింగ్‌కు దిగిన ఈ కుర్రాడు క్రికెట్ బాల్‌ను వేస్తున్నాడో లేక ఇస్రో (ISRO) నుంచి రాకెట్ లాంచ్ చేస్తున్నాడో అర్థం కాక బ్యాటర్లకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
153.6 కిమీ స్పీడ్.. ప్రిన్స్ యాదవ్‌కి మైండ్ బ్లాంక్:
ఆగస్టు 23వ తేదీన గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్ అయితే వేరే లెవెల్. క్రీజులో ఉన్న ప్రిన్స్ యాదవ్‌కి కార్తీక్ త్యాగి గంటకు అక్షరాలా 153.6 కిలోమీటర్ల వేగంతో ఒక రాకెట్ డెలివరీ వేశాడు. బంతి పిచ్‌పై పడి వికెట్ల వైపు రావడం, ప్రిన్స్ బ్యాట్ తిప్పడం, అది క్యాచ్‌గా మారడం.. అంతా కన్నుమూసి తెరిచేలోపే జరిగిపోయాయి. మీరట్ కెప్టెన్ రింకూ సింగ్ ఆ క్యాచ్ పట్టుకుని వేడుకలు చేసుకునే వరకు ప్రిన్స్ యాదవ్‌కి అసలు బంతి వచ్చిందో లేదో కూడా అర్థం కాలేదు. వేగవంతమైన బౌలర్‌గా పేరున్న ప్రిన్స్ సైతం త్యాగి వేసిన ఈ బుల్లెట్ దెబ్బకి షాక్‌లో ఉండిపోయాడు.
మొన్న 149 కిమీ యార్కర్.. శౌర్య సింగ్ మిడిల్ స్టంప్ గోవిందా:
కార్తీక్ త్యాగికి ఇలా స్టంప్‌లను లేపి పడేయడం కొత్తేమీ కాదు. ఆగస్టు 21వ తేదీన నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 కిలో మీటర్ల వేగంతో వేసిన పిన్ పాయింట్ యార్కర్‌కి శౌర్య సింగ్ మిడిల్ స్టంప్ గాల్లోకి ఎగిరి డాన్స్ చేసుకుంటూ వెళ్లి పడింది. పాపం బ్యాటర్ బ్యాట్ కిందకి దించేలోపే వికెట్ కాస్తా రీసైక్లింగ్‌కి వెళ్లిపోయింది.
150 ప్లస్ బుల్లెట్లు.. సెలెక్టర్లకు గట్టి సైరన్:
గత రెండేళ్లలో (2024 UP T20 లీగ్ నుంచి) 140 కిమీ కంటే ఎక్కువ వేగంతో ఏకంగా 150+కి పైగా బంతులు విసిరి స్పీడోమీటర్ కెపాసిటీని టెస్ట్ చేస్తున్నాడు త్యాగి. ఒకవైపు భారత సీనియర్ జట్టు శ్రీలంకతో టెస్టుల్లో బిజీగా ఉంటే, ఇక్కడ ఈ యంగ్ గన్ మాత్రం వైట్ బాల్ లీగ్‌లలో నిప్పులు చెరుగుతున్నాడు. ఇదే రేంజ్ బుల్లెట్ స్పీడ్‌ను నిలకడగా కొనసాగిస్తే, త్వరలోనే టీమిండియా వైట్ బాల్ స్క్వాడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థి బ్యాటర్ల ప్యాంట్ తడపడం ఖాయంగా కనిపిస్తోంది.
Back-to-back strikes from Kartik Tyagi! 2 wickets in two balls to put the pressure right back on.
— UP T20 League (@t20uttarpradesh) August 21, 2026
Watch UPT20 Season 4 live on JioHotstar, StarSports 2 Hindi HD, StarSports 2 Hindi & StarSports.#UPT20 #KhiladiYahanBantaHai #IssBaarSeason4 pic.twitter.com/8xlTrOgjZP
