OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లో క్యూట్ లవ్.. అదిరిపోయే కామెడీ.. టాప్ 4లో దూసుకెళ్తున్న యూత్‌ఫుల్ లవ్ స్టోరీ!

OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లో క్యూట్ లవ్.. అదిరిపోయే కామెడీ.. టాప్ 4లో దూసుకెళ్తున్న యూత్‌ఫుల్ లవ్ స్టోరీ!

Netflixలో ప్రస్తుతం యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌ల హవా నడుస్తోంది. అందులోనూ కోలీవుడ్ టాలెంటెడ్ హీరో అథర్వ, క్యూట్ బ్యూటీ ప్రీతి ముకుందన్ జంటగా నటించిన ‘హృదయం మురళి’ మూవీ యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుంది. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 4 స్థానంలో దూసుకెళ్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ ట్రాక్స్, క్యూట్ లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

యూత్‌కు అద్దం పట్టే భావోద్వేగాలు: ఇష్టపడిన అమ్మాయిని మనసారా ప్రేమించడం, ఆ ప్రేమను సరైన సమయంలో వ్యక్తం చేయలేక లోలోపల మదనపడటం, ఆ తర్వాత మిస్సయ్యామనే బాధతో కుమిలిపోవడం వంటి సున్నితమైన ఫీలింగ్స్‌ను ఈ సినిమాలో డైరెక్టర్ చాలా సహజంగా చూపించారు. కాలేజ్ డేస్ నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసే ఈ కథ నేటి యూత్‌కు వీపరీతంగా కనెక్ట్ అవుతోంది. 

రికార్డుల మోత - గట్టి పోటీ:

ఓటీటీ ట్రెండింగ్ లీస్ట్ లో ఇప్పటివరకు టాప్ 1 & 2 స్థానాల్లో అలరించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'గట్టా కుస్తీ' లాంటి చిత్రాలను వెనక్కి నెట్టింది. వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లో మరింత మంది ఈ మూవీని చూడటంతో ప్రస్తుతం టాప్ 4 స్థానంలో నిలిచింది. 

కథేంటంటే:

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన హృదయ (అధర్వ) మేనమామ సంరక్షణలో పెరుగుతాడు. ఆ లోటు కారణంగా తన భావాలను బయటపెట్టడానికి ఎప్పుడూ వెనుకాడుతుంటాడు. కాలేజీ రోజుల్లో సమంత (ప్రీతి ముకుందన్)ను ప్రేమించినా చెప్పుకోలేడు. ఆ తర్వాత చెన్నైలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో డాక్టర్ అముద (కయాదు లోహర్) పరిచయం కావడంతో ఆమెను కూడా మనసారా ఇష్టపడతాడు. కానీ ఈసారి కూడా తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు.

ALSO READ :  హారర్ మూవీతో నిత్యా మీనన్ రీఎంట్రీ... 

అలా తాను ప్రేమించిన అమ్మాయిలను కోల్పోతూ వచ్చిన హృదయ జీవితంలో మరో కీలక మలుపు వస్తుంది. ప్రేమను మనసులో దాచుకోవడం వల్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? చివరికి హృదయ తన భావాలను వ్యక్తం చేయగలిగాడా? లేదా? అనే అంశాల చుట్టూ సాగే ప్రేమకథ ఇది. ప్రేమలో పడటం సహజమే అయినా, మనసులోని మాటను చెప్పుకోలేకపోవడం వల్ల ఏర్పడే అనుబంధాలు, అపార్థాలు, దూరాలను ఈ కథ ప్రధానంగా చూపిస్తుంది.

విశ్లేషణ

‘హృదయం మురళి’ అనేది కేవలం ఒక సాధారణ లవ్ స్టోరీ కాదు. ప్రేమను పొందడం కంటే, మనసులోని ప్రేమను సరైన సమయంలో వ్యక్తపరచడం ఎంత ముఖ్యమో చెప్పే ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా నిలుస్తుంది. హృదయ పాత్ర ద్వారా దర్శకుడు ఆకాష్ భాస్కరన్ ఒక సున్నితమైన అంశాన్ని చూపించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన హృదయ.. తన భావాలను బయటపెట్టడానికి వెనుకాడుతుంటాడు. అదే అతని ప్రేమ జీవితంలోనూ ప్రతిబింబిస్తుంది. ఇష్టపడిన అమ్మాయిని ప్రేమించినా, ఆ విషయాన్ని చెప్పుకోలేకపోవడం అతని జీవితంలో వరుసగా సమస్యలకు కారణమవుతుంది.

యూత్‌కు ఎందుకు కనెక్ట్ అవుతోంది?

ఈ సినిమాలోని ప్రధాన బలం రియల్ లైఫ్ ఎమోషన్స్. కాలేజ్‌లో ఎవరో ఒకరిని ఇష్టపడటం, ప్రేమిస్తున్నానని చెప్పడానికి భయపడటం, సరైన సమయం కోసం ఎదురుచూస్తూ చివరికి ఆ వ్యక్తిని కోల్పోవడం వంటి అనుభవాలు చాలామంది యువతకు పరిచయమే. అందుకే హృదయ పాత్రతో ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు.

లవ్‌తో పాటు కామెడీ..

సినిమా మొత్తం సీరియస్‌గా సాగకుండా కామెడీ, క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలు కథకు మంచి బ్యాలెన్స్ తీసుకొస్తాయి. ముఖ్యంగా హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, కాలేజ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.