Jaiswal vs Fernando: శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్ట్ తొలి రోజున 17వ ఓవర్ చివరి బంతికి సీన్ వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. అసిత్ ఫెర్నాండో వేసిన తోపు డెలివరీకి జైస్వాల్ ఆఫ్-స్టంప్ ఎగిరిపడింది. పెద్ద వికెట్ పడిందనే జోష్‌తో ఫెర్నాండో ఫుల్ అగ్రెషన్‌తో నోరు పారేసుకున్నాడు. బాధతో సైలెంట్‌గా పెవిలియన్ వైపు వెళ్తున్న జైస్వాల్‌కి ఆ మాటలు విని ఈగో పీక్స్‌కి చేరింది. వెంటనే యూ-టర్న్ తీసుకుని ఫెర్నాండో ముందుకు వచ్చి తలతో అతడి తలని గట్టిగానే ఢీకొట్టాడు.. ఇది చూసిన మిగతా టీమ్‌మేట్స్ వచ్చి గొడవ సర్దుమనిగించకపోతే అక్కడ పెద్ద సిన్మానే జరిగేది.
జైస్వాల్ కి ఐసీసీ భారీ ఫైన్:
ఈ హెడ్‌బట్ సీన్ చూసి ఐసీసీ ఏమాత్రం ఊరుకోలేదు. మైదానంలో ఎదుటి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించడాన్ని (Inappropriate physical contact) నిషేధించే ఐసీసీ ఆర్టికల్ 2.12 కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఇద్దరికీ గట్టి షాకే ఇచ్చింది. జైస్వాల్, ఫెర్నాండో ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అలాగే ఇద్దరికి చెరో డీమెరిట్ పాయింట్‌ను ఖాతాలో పడేసింది.
బ్యాన్ నుంచి లక్కీ ఎస్కేప్:
గ్రౌండ్‌లో అంత రచ్చ జరిగాక జైస్వాల్‌పై ఏమైనా మ్యాచ్ సస్పెన్షన్ పడుతుందేమో అని ఫ్యాన్స్ తెగ భయపడ్డారు. కానీ గత 24 నెలల్లో జైస్వాల్‌కి ఇది ఫస్ట్ బిగ్ ఆఫెన్స్ కావడంతో ఐసీసీ మ్యాచ్ నిషేధం విధింకుండా సేఫ్‌గా వదిలేసింది. అటు గొడవ స్టార్ట్ చేసిన ఫెర్నాండో ట్రాక్ రికార్డ్ కూడా క్లీన్‌గా ఉండటంతో ఇద్దరికీ మ్యాచ్ ఫీజు కోతతోనే సరిపెట్టింది ఐసీసీ. ఫైన్ పడినా, మైదానంలో జైస్వాల్ చూపించిన అగ్రెషన్ మాత్రం నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది.
The ICC have confirmed the sanctions for Yashasvi Jaiswal and Asitha Fernando following their incident during the second #WTC27 contest in Colombo.https://t.co/jYf9ImTHfA
— ICC (@ICC) August 24, 2026
