స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో కంపెనీ M-సిరీస్ లైనప్‌ను విస్తరిస్తూ భారత మార్కెట్లోకి పోకో M8x 5G (Poco M8x 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
ఈ ఫోన్ ధర, లభ్యత, వేరియంట్లు చూస్తే 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 20,999. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999. లాంచ్ ఆఫర్‌లో భాగంగా బ్యాంకు డిస్కౌంట్ ద్వారా బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 18,999కి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ఆగస్టు 27 నుండి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా అమ్మకానికి రానుంది. అలాగే ఆకుపచ్చ, కోబాల్ట్ బ్లూ, నలుపు రంగులలో లభిస్తుంది. ఇక ప్రత్యేక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, బ్యాటరీ & ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్ హైలైట్ ఫీచర్స్ లో దీనిలోని భారీ 7,900mAh బ్యాటరీ. దీనికి తోడుగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనితో ఇతర ఫోన్లను కూడా ఛార్జ్ చేయవచ్చు. ప్రాసెసర్ చూస్తే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 (Qualcomm Snapdragon 4 Gen 5) చిప్‌సెట్‌తో వస్తున్న తొలి ఫోన్లలో ఇది ఒకటి.
డిస్‌ప్లే చూస్తే ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పెద్ద 6.9-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందించారు. ఫోన్ వెనుకవైపు LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందువైపు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ & అప్‌డేట్లు చూస్తే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ హైపర్‌ఓఎస్‌పై పనిచేస్తుంది. కంపెనీ దీనికి 4 సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లను అందిచనుంది. ఇతర ఫీచర్లలో డస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుండి రక్షణ కోసం IP64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
