ఆధ్యాత్మికం: సరళ జీవితం.. సుస్థిర శాంతి.. గుర్తింపు కోసం తాపత్రయం

ఆధ్యాత్మికం: సరళ జీవితం.. సుస్థిర శాంతి.. గుర్తింపు కోసం తాపత్రయం

ప్రతీ ఒక వ్యక్తీ ఓ ప్రత్యేకమైన, సొంత వ్యక్తిత్వం కలిగి ఉండడం అన్నది మన అనుభవంలో ఉన్న విషయం. పుట్టుక తర్వాత ప్రతీ జీవి తనదైన ముద్రలతో నడవడిక సాగిస్తూ ఉంటాడు. రక్త సంబంధం ఉన్నప్పటికీ ఎవరి గుర్తింపు వారిదే, ఎవరి లక్షణాలు వారివే. పురాణేతిహాసాల్లో కూడా ఈ అనుభవాలకి తగ్గ కొన్ని ఉదాహరణలు కనబడుతూ ఉంటాయి. 

కుటుంబ పెద్ద సంపాదన సాగిన మంచి చెడ్డ దారులకి, వాటి ఫలితాలకి కుటుంబ సభ్యులకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం వింటూ ఉంటాం. అలాగే మానవ మనుగడ, విస్తారమైన శాస్త్రాలతో, నిరంతరం అవగాహన ఉండీ తెలివిడి లేకుండా తగాదాలతో, మత్సరాలతో, పరాయి సొత్తుకి ఎప్పుడూ పాకులాడుతూ దోపిడీ మనస్తత్వంతో ఇతరులని అన్నివిధాలుగా గాయపరుస్తూ, భంగ పరుస్తూ, నిత్యం యుద్ధాలతో సాగుతుంది, 

పుట్టుకని అపురూపంగా వేడుకగా చేసుకుంటూనే, ప్రాణాలని మంచినీళ్ల ప్రాయంగా తీయడానికి వెనుకాడ్డం లేదు. ఎప్పుడూ ఓ అశాంతితో సంక్లిష్టతతో జీవిస్తున్నాడు మనిషి సరళంగా బతకడం మానేస్తున్నాడు పరోపకారం ఇదం శరీరం’ అన్న సూక్తి తెలిసి కూడా.

We have failed to create peace and harmony in human society, even by such great attempts as the United Nations, because we do not know the right method. 

( నారద భక్తి సూత్ర పుస్తకంలోని ది వ్యాల్యూ ఆఫ్ డివోషన్ అనే అధ్యాయంలోని మాటలివి)

ఈ విధంగా ఐక్యరాజ్య సమితి వైఫల్యం కూడా వివరించడం జరిగింది, శాంతి సామరస్యాలు సంఘం లో ఏ విధంగా స్థాపించలేక పోయింది అన్న విషయంలో, గతంలోనే. ఈనాటికీ కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అన్న సారాంశంతో అన్నీ రంగాల్లోనూ, ఓ విధాన పత్రాన్ని ప్రకటించింది కూడా. అయినా కల్లోలాల కాపలాధారి అయిన ఆ సంస్థ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది.  

“The living entity is part and parcel of the Supreme Lord, and if he performs the duties of the part and parcel, without proudly thinking he is one in all respects with the Supreme Lord, he attains real perfection  and becomes peaceful.”
“There is no question of lust in the execution of pure devotional service , because in it all material activities are renounced.”


 (పై పుస్తకం లోనివే ఈ వాక్యాలు).

ఏ వాక్యానికి కూడా అర్ధం లేదన్న పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మొదట్లో వివరించుకున్న నేపథ్యంలాగ మనిషి తను పుట్టిన తరువాత తన బతుకుకి ఎంత అవసరమో, తను ఎంతవరకు ఓ చట్ర పరిధిలో ఉన్నాడో, అవగతం చేసుకొని, జీవాత్మ, పరమాత్మల సంవేదన తో పరోపకార త్యాగాలతో మనుగడ సాగించినట్లైతే జీవితాలకి ఉపశమనం కలుగుతుంది అన్నది నిర్వివాదం. ఇంకా వర్తమాన కాలంలో ప్రాధమికావసరాలకై తరాలు తరాలుగా తమ తలరాతల బాగుల కోసం తండ్లాట సాగిస్తున్నారో మన ముందున్న ప్రత్యక్ష దృశ్యమే.

“అనాయేసేన మరణం, వినా దైన్యేన జీవనం! దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీపతి!” ఎటువంటి యాతన పడకుండా, చాలా ఈజీగా మరణించడం, ఏ విధమైన దీనావస్థకులోను కాకుండా గౌరవంగా జీవించడం, మరణించిన తరువాత నీలో ఐక్యమైపోవడం -“పరమేశ్వరా, ఈ మూడు వరాలను నాకు ప్రసాదించు అని కోరుకోవాలి” అన్న తాత్వికత మన సంప్రదాయంలో ఓ నాగరికతా విశిష్టతగా, జ్ఞాన సంపదగా, వేళ్లూనుకోవడం అన్నది మనందరం ఎరిగినదే.

అలాగే ఎన్నో సిద్ధాంతాల రాద్ధాంతాల రాపిడిలో మనం నలిగిపోతునే ఉన్నాం విరామం లేకుండా. అయినా పరిష్కారమార్గాల్లోకి ప్రవేశించలేక పోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ క్రింది పేరా ఓ ఉదాహరణగా పనికొస్తుందని భావించడం జరిగితే సరళ జీవితం, సుస్థిర శాంతి లభిస్తాయి.

శ్రీ మహర్షి వైభవం అన్న గ్రంధంలో “అరుణాచలంలోని కైలాసపతి- శ్రీ రమణ భగవాన్” – అనే వ్యాసంలో ఒక చోట, వ్యాస రచయిత, రుద్రరాజ పాండే, నేపాల్​గారు ఇలా అంటారు: “ప్రపంచ సమస్యను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తాను. విచారమార్గం గురించి మహర్షి బోధించిన తార్కిక రీతినే ఇపుడు అనుసరిస్తాను. ఒక దేశ సమస్య పరాయి దేశాన్ని బాధించేది కాకపోతే అంతర్జాతీయ సమస్య గానీ, ప్రపంచ సమస్య గానీ ఉండదు. 

అందువల్ల రెండు లేక అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య స్పర్ధకు బీజం, ఆయా దేశాలలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే, ‘అంతర్జాతీయ సమస్య’ అంటే ప్రధానంగా జాతీయ సమస్యే అన్న మాట. అలాగే ఒక జాతి సమస్య, ఆ దేశంలోని రాష్ట్రాల నడుమ సమస్య అవుతుంది. 

గ్రామాలకూ, పట్టణాలకూ నడుమ కూడా అవుతుంది. అలా చూసుకుంటూ పోతే చివరికి వ్యక్తి సమస్య అవుతుంది. దీనిని బట్టి తెలిసేదేమిటి? మానవ జాతి మనుగడ పూర్తిగా మారాలంటే, అధికారంలో వున్నవారు కేవలం రాజకీయ, ఆర్ధిక విషయాలకే ప్రాముఖ్యం ఇవ్వక ఆధ్యాత్మిక, నైతిక, విలువలకు ప్రాధాన్యమివ్వాలనీ, వారికి ఆధ్యాత్మిక దృక్పథం ఉండాలనీ తెలుస్తోంది”.

తాత్వికత ఓ పునాది జీవితానికి. అది సరళ జీవితం గడపడంలోనే సాధ్యమవుతుంది. త్యాగబుద్ధి అలవర్చుకోవడంలోనే బతుకులకి అలరింపు కలుగుతుంది. ఇంద్రియ దేహానికీ, ఆధ్యాత్మిక ఆత్మకీ ఉన్న భేదాన్ని గమనించి వర్తించడంలోనే పరమ శాంతి కలుగుతుంది. 

కీ.శే. దాశరధి రంగాచార్యులు గారు తన ‘జీవన యానం’ అన్న గ్రంధంలో ఓ మంచి ఉదాహరణ ఇచ్చారు. అదేమిటంటే మన పూర్వులు భూమిని దున్నడంలోని విజ్ఞత గురించి. ఏడాదికి సరిపడే విధంగా చాలినంత లోతుగానే భూమిని నాగలితో దున్నడం గురించి. జీవన తాత్విక పరిమితుల గురించి.

- ఒబ్బిని-

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com