Sarfaraz Khan Sledging: మైదానంలో 11 మంది ఆటగాళ్లు ఆడుతుంటే, బయట నుంచి సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన 12వ ప్లేయర్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కే సైకలాజికల్ క్లాస్ పీకితే ఎలా ఉంటుంది?.. సరిగ్గా కొలంబో టెస్టులో ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ చేసింది ఇదే.. గాయపడిన రిషభ్ పంత్ స్థానంలో ఫీల్డింగ్ చేయడానికి వచ్చిన సర్ఫరాజ్, ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు లేదనే బాధేమీ లేకుండా గ్రౌండ్లోకి రాగానే స్టంప్ మైక్ దగ్గర తనదైన స్టైల్లో రచ్చ ప్రారంభించాడు. షార్ట్ లెగ్‌లో నిలబడి లంక బ్యాటర్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా కంటిన్యూస్‌గా మాట్లాడుతూ మ్యాచ్‌లో అసలైన కిక్కు తెచ్చాడు.
ఎందుకు బ్రో టైమ్ వేస్ట్ చేస్తావ్?: డి సిల్వాకు కౌంటర్:
ఈ మ్యాచ్‌లో అసలైన హైలైట్ సీన్ లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వాతో జరిగింది. మానవ్ సుతార్ బౌలింగ్ వేస్తున్నప్పుడు డి సిల్వా బౌలర్ వెనకాల ఏదో డిస్ట్రాక్షన్ ఉందంటూ చివరి క్షణంలో క్రీజు నుంచి పక్కకి తప్పుకున్నాడు. దాన్ని అస్సలు వదలకుండా షార్ట్ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్.. అక్కడ ఏమీ లేదు బ్రో, సరిగ్గా చూడు.. అటూ ఇటూ ఎందుకు చూస్తున్నావ్? ఊరికే టైమ్ వేస్ట్ చేయకు, భయపడకుండా ఆడు (Don't be scared. Play) అంటూ లైవ్‌లోనే క్లాస్ పీకేశాడు. ఈ డైలాగులు స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
పంత్ లేని లోటు ఫిల్.. షార్ట్ లెగ్‌లో నెక్ట్స్ లెవెల్ వైబ్స్:
సాయి సుదర్శన్ స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్‌కి ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు మాత్రం దక్కలేదు. కానీ రిషభ్ పంత్ గాయపడటంతో ఫీల్డింగ్‌కి వచ్చి, అతడు లేని లోటు ఏమాత్రం తెలియకుండా స్టంప్ మైక్ దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేయడం అంటే ఎంతో కాన్సంట్రేషన్, క్విక్ రిఫ్లెక్సెస్ కావాలి.. అక్కడ అప్రమత్తంగా ఉంటూనే, అటు లంక బ్యాటర్ల మైండ్ గేమ్‌ను దెబ్బతీసే పనిని సర్ఫరాజ్ పక్కాగా పూర్తి చేశాడు. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా, సర్ఫరాజ్ ఫన్ వైబ్స్ మాత్రం ఫ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ నవ్వులు తెప్పిస్తున్నాయి.
SARFARAZ KHAN - PART-TIME FIELDER, FULL-TIME MIND GAMES. 😂
— Mufaddal Atif (@MufaddalAtif) August 25, 2026
Bro, nothing is there. Don’t be scared. Play. You are the captain.
From short leg, Sarfaraz kept the pressure on Dhananjaya de Silva with constant chatter and clever mind games.
He may not have been the man with the… pic.twitter.com/CXURtz78h3
