హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అర్హులెవరనే వివరాలను మంగళవారం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాల పరిశీలన ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. అప్లికేషన్లలో ప్రాథమికంగా అనర్హులను గుర్తించి వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వైపు ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులను స్వీకరించినట్లు వివరించారు. ఈ ఇండ్ల కోసం 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు.
