బైక్ అదుపు తప్పి.. పైనుంచి లారీ వెళ్లి.. యువకుడు మృతి

బైక్ అదుపు తప్పి.. పైనుంచి లారీ వెళ్లి.. యువకుడు మృతి

గండిపేట, వెలుగు: పాలమాకుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బైక్​అదుపుతప్పి కిందపడిన ఓ యువకుడు.. పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మామిడిపల్లికి చెందిన వెంకటేశ్​సోమవారం తన స్నేహితుడు కార్తీక్​రెడ్డితో కలిసి బైక్​పై జడ్చర్ల వైపు వెళ్తున్నాడు. 

పాలమాకుల దాటాక ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌‌‌‌టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ వెంకటేశ్​పైనుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కార్తీక్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ బ్రహ్మదేవ్ యాదవ్‌‌‌‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.