వేగంగా ఓవర్సీస్ అప్లికేషన్ల పరిశీలన..వచ్చే నెల1న అర్హుల లిస్ట్ రిలీజ్

వేగంగా ఓవర్సీస్ అప్లికేషన్ల పరిశీలన..వచ్చే నెల1న అర్హుల లిస్ట్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కీమ్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా సాగుతోంది. 

ఈసారి 300 మందికి స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు అందించనుండగా, 475 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్లను అధికారుల కమిటీ నిశితంగా పరిశీలిస్తోంది. వచ్చే నెల 1లోగా అర్హుల జాబితా రెడీఅవుతుందని తెలిపారు.