ఓవర్ స్పీడ్తో ఆరుగురిని ఢీకొన్న కారు.. అందరూ కొండాపూర్‌ విజ్ఞాన్‌ కాలేజీ ఉద్యోగులే

ఓవర్ స్పీడ్తో ఆరుగురిని ఢీకొన్న కారు.. అందరూ కొండాపూర్‌ విజ్ఞాన్‌ కాలేజీ ఉద్యోగులే

ఘట్‌కేసర్‌, వెలుగు: ఓవర్​స్పీడ్​తో వచ్చిన ఓ కారు.. ఆరుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. కొండాపూర్‌ విజ్ఞాన్‌ కళాశాలకు చెందిన ఉద్యోగులు సోమవారం రాత్రి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో కారు అతివేగంగా వారిపైకి దూసుకెళ్లింది. బాధితులను గాంధీ హాస్పిటల్​కు తరలించారు.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్​మద్యం మత్తులో ఉన్నాడా? లేదంటే అతివేగమే ప్రమాదానికి కారణమా అనే కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.