దృశ్యం ది కన్‌‌‌‌క్లూజన్‌‌‌‌ రిలీజ్ డేట్ ఫిక్స్

దృశ్యం ది కన్‌‌‌‌క్లూజన్‌‌‌‌ రిలీజ్ డేట్ ఫిక్స్

అజయ్ దేవగణ్‌‌‌‌ హీరోగా హిందీలో రూపొందుతున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మూడో భాగం రిలీజ్‌‌‌‌కు రెడీ అవుతోంది. సోమవారం మూవీ టైటిల్‌‌‌‌ను రివీల్ చేయడంతో పాటు రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు.  ఇప్పటివరకు ‘దృశ్యం 3’గా ఇది ప్రచారంలో ఉండగా, ‘దృశ్యం: ది కంక్లూజన్‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌ను ప్రకటించారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 2న సినిమాను విడుదల చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో ‘‘నా నిజం, నా నైతికత కూడా నా కుటుంబమే” అనే క్యాప్షన్‌‌‌‌ ఆకట్టుకుంది. రెండో భాగాన్ని తెరకెక్కించిన అభిషేక్ పాఠక్‌‌‌‌ దీనికి దర్శకత్వం వహించాడు. టబు, శ్రియా శరణ్, ఇషితా దత్తా, రజత్ కపూర్, కమలేష్ సావంత్, ప్రకాశ్ రాజ్  కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్, స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.  

మలయాళ సినిమాకు ఇది సీన్ బై సీన్ రీమేక్ కాదని, సీన్స్‌‌‌‌తో పాటు క్లైమాక్స్‌‌‌‌లోనూ మార్పులు ఉంటాయని ఇప్పటికే మేకర్స్‌‌‌‌ క్లారిటీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే టైటిల్‌‌‌‌లో కంక్లూజన్‌‌‌‌ అనే పదం చేర్చారు. దీన్నిబట్టి ఈ సినిమాతో కథకు ముగింపు చెప్పబోతున్నట్టు అర్థమవుతోంది. మరోవైపు మోహన్‌‌‌‌లాల్‌‌‌‌ హీరోగా జీతూ జోసఫ్ తీసిన మలయాళ వెర్షన్‌‌‌‌కు 4వ భాగం కూడా ఉండబోతోందని ఇటీవల నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు.