‘ఇరుముడి’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రవితేజ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు.
వచ్చే నెలనుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే.. వైవిధ్యమైన కథలు, హ్యూమర్‌తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా అంచనాలు పెంచింది. ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్’, ‘వీరాధి వీరులంట.. కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు ప్రకటించనున్నారు.
Super congratulations to our Mass Maharaja @RaviTeja_offl garu not just for delivering a BLOCKBUSTER but also for reviving the BOX OFFICE and FOOTFALLS in a way we haven’t seen in recent times with #IRUMUDI 💥💥💥
— Sri Venkateswara Creations (@SVC_official) August 25, 2026
Now, gear up for a MOST ENTERTAINING & ABSOLUTELY REFRESHING… pic.twitter.com/XOXds0E5et
Irumudi Box Office:
రవితేజ ‘ఇరుముడి’ రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆయన కెరీర్‌లో ఈ మార్క్ అందుకున్న మూడో సినిమాగా నిలిచింది. గతంలో ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ ఈ ఘనత సాధించాయి. ‘ఇరుముడి’ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటగా, పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే యశ్ ‘టాక్సిక్’ విడుదలతో పోటీ పెరగనుంది.
With the blessings of Lord Ayyappa and the love from the audience, #Irumudi hits a century ❤🔥❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026
100 CRORES GROSS WORLDWIDE 🔥🔥
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/QSJF8T3GrC
