మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరి ప్రవర్తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని కమిటీ భావించింది.
ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి నివేదిక అందించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్.. మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మల్లురవి.. పార్టీ లైన్ దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని, క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు మల్లు రవి స్పష్టం చేశారు. దీనిపై తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని తెలిపారు.
