అంపైర్లతో గొడవ.. కోపంతో గ్లౌవ్స్ విసిరికొట్టిన లంక ప్లేయర్: ఐసీసీ సీరియస్ యాక్షన్!

అంపైర్లతో గొడవ.. కోపంతో గ్లౌవ్స్ విసిరికొట్టిన లంక ప్లేయర్: ఐసీసీ సీరియస్ యాక్షన్!

IND vs SL 2nd Test: భారత్ వర్సెస్ శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయంలో కొలంబో మైదానంలో ఊహించని హై డ్రామా కొనసాగింది. టీమిండియా 503/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాక లంక బ్యాటింగ్‌కి దిగగా, చివర్లో వెలుతురు (Bad Light) బాగా తగ్గిపోయింది. చీకటి పడుతుండటంతో ఆటను ఆపేయాలని శ్రీలంక బ్యాటర్ ప్రభాత్ జయసూర్య.. అంపైర్లు నితిన్ మీనన్, శరఫుద్దౌలాలను గట్టిగా నిలదీశాడు. కానీ అంపైర్లు ఆట కొనసాగించడానికే మొగ్గు చూపడంతో జయసూర్య, కమిందు మెండిస్ ఫుల్ ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యారు.

ఔటయ్యాక గ్లౌవ్స్ విసిరికొట్టిన ప్రభాత్: 

వెలుతురు తక్కువగా ఉండటంతో బంతి సరిగ్గా కనిపించక జయసూర్య వికెట్ పారేసుకున్నాడు. అంపైర్ల నిర్ణయం వల్లే తాను అవుటయ్యాననే తీవ్ర కోపంతో పెవిలియన్ వైపు వెళ్తూ, చేతికి ఉన్న గ్లౌవ్స్‌ను నేలకేసి విసిరికొట్టాడు. మైదానంలో ప్రభాత్ చూపించిన ఈ ఆగ్రహానికి సంబంధించిన వీడియో నిమిషాల్లో నెట్టింట్లో వైరల్ ఫుల్ వైరల్ అయింది.  

ఐసీసీ డిమెరిట్ పాయింట్: 

* క్రికెట్ స్టేడియంలో కిట్‌ను లేదా క్రీడా పరికరాలను కోపంతో విసిరికొట్టడం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు పూర్తి విరుద్ధం. దీంతో ఐసీసీ వెంటనే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంది. 

* ఆర్టికల్ 2.2 ఉల్లంఘన: ప్లేయర్ కిట్‌ను దుర్వినియోగం చేసినందుకు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 కింద ప్రభాత్ జయసూర్య దోషిగా తేలాడు.

*  డిమెరిట్ పాయింట్: గత ఏడాది కాలంలో ఇతనికి ఇదే తొలి తప్పు కావడంతో, ఐసీసీ జయసూర్య ఖాతాలో 1 డిమెరిట్ పాయింట్ విధించి వార్నింగ్ ఇచ్చింది.

* తప్పు అంగీకారం: ఎలాంటి ప్రత్యేక విచారణ (Formal Hearing) లేకుండా ప్రభాత్ జయసూర్య నేరుగా తన తప్పును ఒప్పుకోవడంతో ఐసీసీ ఈ విషయాన్ని ఇక్కడితో క్లోజ్ చేసింది.