మిలాద్-ఉన్-నబీ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దారుస్సలాం పరిసర ప్రాంతాల్లో ఆగస్ట్ 25 సాయంత్రం 6 గంటల నుంచి రేపు(ఆగస్టు26) ఉదయం 4 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడకుండా పోలీసులు పలు మార్గాలను మళ్లించారు.
ట్రాఫిక్ మళ్లింపు వివరాలు ఇలా ..
మలక్‌పేట, బేగంబజార్ ఛత్రీ నుంచి దారుస్సలాం వైపు వెళ్లే వాహనాలను అలస్కా టీ-జంక్షన్ వద్ద ఎంజే బ్రిడ్జి, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
మల్లేపల్లి ఎక్స్-రోడ్స్, బోయిగూడ కమాన్ నుంచి దారుస్సలాం వైపు వెళ్లే వాహనాలను ఆగాపురా ఎక్స్-రోడ్ వద్ద టక్కర్‌వాడి, చార్మినార్ వైపు మళ్లిస్తారు.
అదేవిధంగా, బజార్‌ఘాట్, తాజ్ ఐలాండ్ నుంచి వచ్చే వాహనాలను ఏక్ మినార్ వద్ద బజార్‌ఘాట్, నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు పంపిస్తారు.
మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్ నుంచి దారుస్సలాం వెళ్లే వాహనదారులు మల్లేపల్లి ఎక్స్-రోడ్స్ నుంచి గోకుల్ నగర్, బజార్‌ఘాట్ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని నగర పోలీసుల సూచన...
పార్కింగ్ ఏర్పాట్లు...
- జల్సా కు హాజరయ్యే వారి కోసం పోలీసులు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం..
- ఫోర్ విల్లర్స్ కోసం సీతారాంబాగ్ ప్రభుత్వ డిస్పెన్సరీ, రాకెట్ గ్రౌండ్‌లో స్థలాలను కేటాయించారు.
- ద్విచక్ర వాహనాలను ఆఘా దర్గా, సర్దార్ బేగ్ దర్గా, పాన్ మండి రోడ్, ఎస్‌బీఐ రోడ్ల వద్ద పార్క్ చేయాలని సూచించారు.
- నగర ప్రజలు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను ,పార్కింగ్ ప్రదేశాలను గమనించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి...
