మిస్ యూనివర్స్ ఇండియాగా 19 ఏండ్ల కేరళ కుట్టి

మిస్ యూనివర్స్ ఇండియాగా 19 ఏండ్ల కేరళ కుట్టి

జైపూర్: కేరళకు చెందిన 19 ఏండ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా–2026 టైటిల్ గెలుచుకుంది. జైపూర్‌‌‌‌లోని జీ స్టూడియోస్‌‌‌‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా పోటీపడిన 52 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి కజియా ఈ ఘనత సాధించింది. గతేడాది టైటిల్ విన్నర్ మణికా విశ్వకర్మ నూతన విజేతకు కిరీటాన్ని అలంకరించింది. ఈ గెలుపుతో నవంబర్‌‌‌‌లో ప్యూర్టోరికోలో జరుగనున్న 75వ మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌‌‌‌ తరఫున కజియా ప్రాతినిధ్యం వహించనుంది. 

ఈ పోటీల్లో వైష్ణవి గణేశ్ ఫస్ట్ రన్నరప్‌‌‌‌గా, అనుశ్రీ శతావలేకర్ సెకండ్ రన్నరప్‌‌‌‌గా నిలిచారు. హీరోయిన్లు సుస్మితా సేన్, ఊర్వశి రౌతేలా, మిస్ యూనివర్స్ ఇండియా–2024 రియా సింఘా, మాజీ రన్నరప్ సెలీనా జైట్లీ ఈ పోటీకి జడ్జిలుగా వ్యవహరించారు. టైటిల్ గెలుచుకున్న అనంతరం కజియా మాట్లాడింది. మూడేండ్ల తన శ్రమకు ఫలితం దక్కిందని.. సొంత రాష్ట్రమైన కేరళతో పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది. మిస్ యూనివర్స్ వరల్డ్ కిరీటాన్ని ఇండియాకు తీసుకురావడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడించింది.