ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన స్తూపం ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతోంది. ఆవరణలో రంగురంగుల పూల మొక్కలు, విద్యుద్దీపాలతో పాటు సందర్శకులు సేదతీరేందుకు బెంచీలు సైతం ఏర్పాటు చేశారు. దీంతో స్తూపాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులు ఆహ్లాదకర వాతావరణంలో హాయిగా గడుపుతున్నారు.
