బషీర్‌బాగ్, వెలుగు: మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ షోకాజ్‌నోటీసులు ఇవ్వడం అన్యాయమని బీసీ నేతలు నీరజాగౌడ్, కటకం నర్సింగ్‌రావు, కె.యాదవ్, ఎన్.చిన్నరాములు ముదిరాజ్, బొంగు ప్రసాద్‌గౌడ్ అన్నారు. ఆమెపై చర్యలు తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌లో రెడ్లకో న్యాయం.. బీసీలకో న్యాయమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా ఇతర నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్‌చేశారు.
