బెంగళూరు: నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఈస్ట్ జోన్ విజయం దిశగా సాగుతోది. షాబాజ్ అహ్మద్ (167, 3/20) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకోవడంతో 355/6 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 112.5 ఓవర్లలో 467 రన్స్‌కు ఆలౌటైంది. షాబాజ్‌కు తోడు అనుకూల్ రాయ్ (37) రాణించాడు. ఆకాశ్ చౌదరి, ఫిరోజియమ్ జోటిన్ చెరో మూడు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 42.5 ఓవర్లలో 111 రన్స్ ఆలౌటై ఫాలో ఆన్‌లో పడింది. అర్పిత్ బటేవార (32), రోంగ్‌సెన్ జొనాథన్ (21) పోరాడి విఫలమయ్యారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నార్త్ ఈస్ట్ జోన్ ఆట ముగిసే టైమ్‌కు ఒక ఓవర్‌లో 7/0 స్కోరు చేసింది. జోసెఫ్ (6 బ్యాటింగ్), అర్పి త్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్‌తో జరుగుతున్న మరో క్వార్టర్‌ఫైనల్లో నార్త్ జోన్ 171 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
31/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 187 రన్స్‌కు ఆలౌటైంది. షామ్స్ ములానీ (52) టాప్ స్కోరర్. అబిద్ ముస్తాక్ 5 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 107/4 స్కోరు చేసింది. ఆయుష్ బదోనీ (39 బ్యాటింగ్), కన్హయ్య వాదవాన్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
