ఫోన్ పోగొట్టుకున్నానని, తల్లిదండ్రులు తిడతారనే భయంతో చచ్చిపోయిండు !

ఫోన్ పోగొట్టుకున్నానని, తల్లిదండ్రులు తిడతారనే భయంతో చచ్చిపోయిండు !

మనోహరాబాద్, వెలుగు: ఫోన్ పోగొట్టుకున్నానని, తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సుభాష్​గౌడ్ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(25) ఆదివారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ఇంట్లో భోజనం చేసి రాత్రి బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం సుమారు 8:30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి తన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కడో పోయిందని తల్లి శ్రీలతకు చెప్పి బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

చాలాసేపటి దాకా డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీయకపోవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు పిలిచారు. అయినా స్పందించకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా మహేశ్ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాడుతో ఉరేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని కిందికి దించి పోస్టుమార్టం కోసం తూప్రాన్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.