ఆచంట మహేష్ శివాలయం మూవీ షూటింగ్ షురూ 

ఆచంట మహేష్ శివాలయం మూవీ షూటింగ్ షురూ 

‘రంగస్థలం’ ఫేమ్  ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి  జంటగా వెంకట్‌‌‌‌రెడ్డి నంది దర్శక నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభమైంది. సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రానికి ‘శివాలయం’ అనే టైటిల్‌‌‌‌ను ప్రకటించారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు ‘ఘర్షణ’  శ్రీనివాస్ క్లాప్ కొట్టగా, ‘దిల్’ రమేష్  కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత వెంకట్‌‌‌‌రెడ్డి నంది మాట్లాడుతూ ‘శివుడి లీలలు, మహిమలు, భక్తి భావనతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 

ప్రేక్షకులకు భక్తితో పాటు మంచి కథ, భావోద్వేగాలు, వినోదాన్ని అందించేలా ఈ చిత్రం ఉంటుంది. సెప్టెంబర్ నుంచి  రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని అన్నారు. ఈ చిత్రంలో ‘ఘర్షణ’  శ్రీనివాస్, లెంకల అశోక్ రెడ్డి, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, కుప్పిలి శ్రీనివాస చారి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  డ్రమ్స్ రాము సంగీతం అందిస్తున్నాడు.