‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయని రవితేజ అన్నారు. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న పాన్ ఇండియావైడ్‌గా విడుదలై హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో రవితేజ మాట్లాడుతూ ‘డైరెక్టర్ శివ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు.
ఇందులో నటించిన వాళ్లందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్. మ్యూజిక్‌తో సినిమా చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రేక్షకుల రియాక్షన్ చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి రావడం మానేసిన వాళ్లు మళ్లీ ‘ఇరుముడి’ సినిమా చూడడానికి థియేటర్‌కి రావడం గురించి వింటుంటే నాకు మామూలు ఆనందం కాదు.
నిజానికి నాది రాతి గుండె.. సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఎడిట్ రూమ్‌లో ఈ సినిమా చూసి ఏడ్చేశాను. ఇలాంటి ఫీల్ ఉన్న ఎమోషనల్ సినిమా తీసిన శివ నిర్వాణకు, పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని చెప్పారు. సినిమా బ్లాక్‌బస్టర్ కావడం చాలా ఆనందంగా, ఎమోషనల్‌గా ఉందని ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర చెప్పారు.
ఈ సినిమా విజయం దర్శకుడిగా తనపై బాధ్యతను పెంచిందని శివ నిర్వాణ అన్నాడు. ‘సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తుంటే సంతోషంగా ఉంది’ అని నిర్మాతలు అన్నారు. నటులు సాయికుమార్, స్వసిక విజయన్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
