పాల్వంచ,వెలుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు.
రెండో పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు, బకాయి బిల్లులు విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ అమర్నేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, పెన్షనర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.
