తాలిపేరుకు పోటెత్తిన వరద..8 గేట్లు ఓపెన్..గోదావరిలోకి నీటిని విడుదల చేసిన అధికారులు

తాలిపేరుకు పోటెత్తిన వరద..8 గేట్లు ఓపెన్..గోదావరిలోకి నీటిని విడుదల చేసిన అధికారులు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏజెన్సీలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. భారీ వర్షాల కారణంగా ఛత్తీస్‌‌గఢ్‌‌లోని తాలిపేరు పరివాహక ప్రాంతం నుంచి భారీగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి 73,988 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 

ప్రాజెక్టులోని 8 గేట్లను పూర్తిగా, మరో 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా.. భద్రతా దృష్ట్యా అదనపు నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.