రా రైస్‌‌ను డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలి : సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

రా రైస్‌‌ను డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలి : సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌‌లో ఉన్న రా రైస్‌‌ను త్వరగా ప్రాసెస్ చేసి మిల్లుల నుంచి డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు.  సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. బియ్యం సరఫరాలో జాప్యం చేస్తూ సాకులు చెప్పే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. 

దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ కంటే రా రైస్‌‌కే అత్యధిక డిమాండ్ ఉన్నందున, ఎఫ్‌‌సీఐ అవసరాలకు తగినట్టుగా ప్రాసెసింగ్‌‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీఎస్‌‌వోలు, జిల్లా మేనేజర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.