హైదరాబాద్, వెలుగు: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును వచ్చే నెల ఒకటో తేదీ వరకూ పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. లింగయ్య సోమవారం తెలిపారు.
2026–-27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని సూచించారు. తొలుత ప్రకటించిన గడువు ముగియడంతో విద్యార్థుల సౌకర్యార్థం మరోసారి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
