గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫినాలేలో కీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజ్ఞానంద చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫినాలేలో కీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజ్ఞానంద చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫినాలేలో కీలక విజయం సాధించాడు. సోమవారం జరిగిన క్లాసికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞా 55 ఎత్తుల వద్ద విన్సెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు. దాంతో 9–3 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఫలితంగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరడానికి ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేవలం ఆరు పాయింట్ల దూరంలో ఉన్నాడు.

ఇందులో రెండు ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడాల్సి ఉంటుంది. గెలిచిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నాలుగు పాయింట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నాలుగు బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. వాటిలో గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. కాబట్టి ప్రజ్ఞానంద ఈజీగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తాడని అంచనా వేస్తున్నారు. కీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద ఆరంభంలో తడబడ్డాడు. అయితే ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బితో కీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేశాడు.  

ఫలితంగా కీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోల్పోయి రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొందాడు. కానీ నల్ల పావులతో ఆడేటప్పుడు రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రజ్ఞాకు కలిసొచ్చింది. రెండో టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞానంద.. కీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజుకు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేంత దగ్గరగా రావడంతో జర్మనీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 55వ ఎత్తు వద్ద ఓటమిని అంగీకరించాడు. ఇక ఫ్యాబియానో కరువాన (అమెరికా, 6), వెస్లీ సో (అమెరికా, 6) మధ్య జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా అయ్యింది.