ఆమ్స్టర్డామ్: ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా డ్రైవర్ల అకౌంట్లను తొలగించిన క్యాబ్ సర్వీసెస్ కంపెనీ ఉబర్‌కు నెదర్లాండ్స్డేటా ప్రొటెక్షన్ అథారిటీ 825 మిలియన్ల యూరోల (దాదాపు రూ.9,244.67 కోట్ల) పెనాల్టీ వేసింది. మనుషుల పర్యవేక్షణ లేకుండా ఏఐ టెక్నాలజీల ద్వారా డ్రైవర్లను తీసేయడం నిబంధనలకు విరుద్ధమని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన 170 మంది డ్రైవర్లు ఉబర్నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు.
డిజిటల్ రైట్స్ సంస్థ సహాయంతో వీరు నెదర్లాండ్స్‌లోని ఉబర్ యూరోపియన్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వివరాలు సేకరించారు. 2019లో మొదలైన ఈ వివాదం ఇప్పుడు చరిత్రలోనే రెండో అతిపెద్ద జరిమానాగా మారింది. కంప్యూటర్లే ఉద్యోగాలను తీసేయడం సరికాదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును ఉన్నతస్థాయిలో సవాలు చేస్తామని ఉబర్ స్పష్టం చేసింది. అమెరికా టెక్ కంపెనీలపై యూరప్ విధిస్తున్న ఇలాంటి జరిమానాలు చర్చకు దారితీస్తున్నాయి.
