వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ పార్ట్‎నర్‎గా అనూజ్  

వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ పార్ట్‎నర్‎గా అనూజ్  

హైదరాబాద్, వెలుగు: ఆర్థిక సేవలు అందించే వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ సంస్థ, అనూజ్ మెహతాకు పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రమోషన్​ఇచ్చింది. ఈ సంస్థ రూ.17 వేల కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తోంది. ఫైనాన్షియల్​ ప్లానర్ల సేవలను విస్తరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అనుజ్​ గతంలో వైస్– ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు.

ఆయనకు ఆర్థిక సలహా, రిస్క్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పదేళ్ల  అనుభవం ఉంది. కేపీఎంజీ, క్రెడిట్ సూయిజ్​లోనూ పనిచేశారు.  ఇక నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్, సెంటర్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించడంపై దృష్టి పెడతారని, దక్షిణాది కంపెనీ వృద్ధికి ఈ నిర్ణయం మరింత దోహదపడుతుందని వన్​ఫైనాన్స్ తెలిపింది.