సిటీ ట్రాఫిక్ అంటే పరేషాన్.. ట్రాఫిక్ నరకం.. ఏంటీ ట్రాఫిక్ జామ్స్.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు.. ట్రాఫిక్ ఎందుకు ఇంత ఉంది.. ట్రాఫిక్ ఎందుకు క్లియర్ కావటం లేదు.. వాహనాలు ఎందుకు స్లోగా వెళుతున్నాయి.. బండి, కారుతో రోడ్డెక్కే ప్రతి వాహనదారుడి నోటి నుంచే కామన్ గా వచ్చే మాటలు ఇవి.. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు ఉన్నా.. జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా.. ట్రాఫిక్ రద్దీని ఎప్పటికిప్పుడు పోలీసులు నియంత్రిస్తున్నా.. అప్పటికీ వాహనదారుల్లో చాలా మంది అవగాహన ఉండదు.. దీన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు సిటీ పోలీసులు.. ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటో వివరంగా తెలుసుకుందామా..
బెంగళూరు ట్రాఫిక్ అంటే మామూలుగా ఉండదు.. ఎన్నోసార్లు వందల సంఖ్యలో వార్తల్లో చదివి ఉంటాం.. ఇక ట్రాఫిక్ బాధలు బెంగళూరు సిటీ జనానికి బాగా తెలుసు. ట్రాఫిక్ ఎందుకు ఉంటుంది అనేది కామన్ పీపుల్.. వాహనదారులు, సిటీ జనానికి అవగాహన కల్పించటం కోసం.. మీరు ఒక రోజు ట్రాఫిక్ పోలీస్ అవుతారా అనే నినాదంతో ముందుకు వచ్చింది. దీని పేరే ఒక రోజు పోలీస్ ప్రోగ్రామ్. సిటీలో ట్రాఫిక్ సవాళ్లపై జనానికి అవగాహన కల్పించటం కోసం దీన్ని తీసుకొచ్చింది. BTP ASTraM అనే యాప్ ఉంది. అందులో మీ పేరు నమోదు చేసుకుంటే.. మీరు ఒక రోజు ట్రాఫిక్ పోలీస్ కావొచ్చు అన్న మాట.
BTP ASTraM యాప్ లో మీ పేరు నమోదు చేసుకుంటే.. మీరు ఒక రోజు ట్రాఫిక్ పోలీస్ అవుతారు.. మీకు కేటాయించిన ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తారు. ఆ ప్రాంతంలో ఉండే ట్రాఫిక్ పోలీసులతో కలిసి మీరు పని చేస్తారు. జంక్షన్స్ దగ్గర సిగ్నల్స్ ఎలా పని చేస్తాయి.. ఎటు వైపు నుంచి వాహనాలు వదలాలి.. ఎమర్జెన్సీ వాహనాలు అదేనండీ అంబులెన్స్, పోలీస్, ఫైర్, వీవీఐపీ, వీఐపీ వెహికల్స్ మూమెంట్ అప్పుడు ఎలా మేనేజ్ చేయాలి.. రాంగ్ రూట్ వచ్చే వాహనాలను ఎలా హెచ్చరించాలి.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఎలా నియంత్రించాలి అనే అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తారన్న మాట.
►ALSO READ | క్విక్ కామర్స్ సంస్థల లైసెన్స్‌లు రద్దు.. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం
దీని వల్ల బెంగళూరు సిటీ ట్రాఫిక్ పై వాహనదారులకు మరింత అవగాహన పెరిగే.. రోడ్డెక్కిన తర్వాత ఎలాంటి రూల్స్ పాటించాలి.. ఎంత ఓపిగ్గా ఉండాలి.. సిటీలో మన ఒక్క వాహనమే కాదు.. లక్షల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి అనే నాలెడ్జ్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్.
కర్నాటక రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. బెంగళూరు ట్రాఫిక్.. మీరందరూ దానిని అనుభవించే ఉంటారు.. రోజు రోజుకు పెరుగుతున్న సిటీ ట్రాఫిక్ ను నిర్వహించడానికి.. నియంత్రించటానికి నిజంగా ఏమి అవసరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక రోజు ట్రాఫిక్ పోలీసుగా మారండి.. మీకు అవకాశం కల్పిస్తున్నాం.. బెంగళూరు సిటీ ట్రాఫిక్ ను అర్థం చేసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నాం.. దీని వల్ల మీకు ప్రత్యక్షంగా.. క్షేత్రస్థాయి అనుభవం వస్తుంది. మీరు చేయాల్సింది ఒక్కటే.. BTP ASTraM యాప్ లో మీ వివరాలు ఇప్పుడే నమోదు చేసుకోండి.. ఇలా చేస్తే మీరు పోలీస్ దళంలో చేరటానికి, మెళకువలు నేర్చుకోవడానికి, నిజమైన అధికారులతో కలిసి పని చేయటానికి.. రోడ్లపై ట్రాఫిక్ నిర్వహించటంలో అవకాశం లభిస్తుంది అంటూ ట్విట్ చేశారాయన.
ఏదిఏమైనా ఈ ప్రోగ్రామ్ మాత్రం బెంగళూరు సిటీ యూత్ కు బాగా నచ్చినట్లు ఉంది. ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ అయ్యారంట.. ఈ రెస్పాన్స్ చూస్తేనే తెలుస్తుంది.. బెంగళూరు సిటీ ట్రాఫిక్ పై ఎంత ఆసక్తి ఉందో అని కదా..
