క్విక్ కామర్స్ సంస్థల లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రద్దు.. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం

క్విక్ కామర్స్ సంస్థల  లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రద్దు.. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం

బెంగళూరు: విషపూరితమైన ఉమ్మెత్త కాయ లు, విత్తనాలను ఆహార పదార్థాలుగా విక్రయిస్తున్న క్విక్ కామర్స్ సంస్థలు అమెజాన్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టామార్ట్, బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కర్నాటక ఆహార భద్రత, ఔషధ నియంత్రణ సంస్థ షాక్ ఇచ్చింది. మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ఈ విషపూరిత ఉత్పత్తులను అమ్మకానికి ఉంచడంతో పాటు, గోదాముల్లో నిల్వ చేసినందుకు గాను ఆయా కంపెనీల ఆహార లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

కొన్ని ప్యాకెట్లపై ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ లైసెన్స్ నంబర్లను ముద్రించి విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఆయా సంస్థల వివరణతో సంతృప్తి చెందని ఆహార భద్రతా ప్రాధికార సంస్థ, విషపూరిత పదార్థాలను ఆహారంగా అమ్మడం లేదా నిల్వ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.