కళ్ల ముందే నా భార్య చనిపోయింది.. సూర్యాపేట బస్సు ప్రమాద బాధితుడి ఆవేదన.. ప్రమాదానికి కారణం అతడే!

కళ్ల ముందే నా భార్య చనిపోయింది.. సూర్యాపేట బస్సు ప్రమాద బాధితుడి ఆవేదన.. ప్రమాదానికి కారణం అతడే!

హైదరాబాద్–విజయవాడ హైపేవై 2026 ఆగస్టు 26న జరిగిన బస్సు–కంటైనర్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సూర్యపేట జిల్లాలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో 6 మంది చనిపోగా.. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి బస్సులో ప్రయాణిస్తూ.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు రాక మానవు.

హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం దుర్గాపురం స్టేజి వద్ద ఈ ప్రమాదం జరిగింది.  టీ బ్రేక్ తీసుకున్న అనంతరం బస్సు తిరిగి ప్రారంభమైన గంటలోపే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు బస్సులో ప్రయాణిస్తున్న ఓ క్షతగాత్రుడు చెబుతున్నాడు. వెనుక సీట్లో తన భార్య కూర్చుందని, ప్రమాదంలో ఆమె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారన్నారు. 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రుడు ఆరోపిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్దపెద్ద ఇనుప రాడ్లు బస్సులోని ప్రయాణికులపై పడటంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, ఆ గాయాల కారణంగానే కొంతమంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నాడు. 

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఆరుగురి ప్రాణాలను బలితీసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు.  అప్పటికే  ప్రమాదానికి గురై రోడ్డుపై ఆగిపోయిన లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత లారీ రోడ్డుపైనే ఆగిపోవడం, ఆ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గుర్తించకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందన్నా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్‌

 ప్రమాదంలో ఆరుగురు ఆసుపత్రికి చేరుకునేలోపే మృతి చెందారన్నారు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ . మరో 14 మంది తీవ్ర గాయాలతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 14 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం ఆసుపత్రికి వచ్చిన క్షతగాత్రులకు తల, ఛాతి, కడుపు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు డాక్టర్స్ . బలమైన ఇనుప రాడ్లపై పడటం వల్లే పలువురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు కోదాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్.  

చనిపోయిన వారి వివరాలు:

ప్రమాద సమయంలో బస్సు లో మొత్తం 42 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 6 మంది చనిపోయారు. మృతుల్లో ఐదు మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.  మరో 12 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.