హుస్సేన్ సాగర్లోకి దూకిన విదేశీయుడు.. కాపాడిన సైఫాబాద్ పోలీసులు

హుస్సేన్ సాగర్లోకి దూకిన విదేశీయుడు.. కాపాడిన సైఫాబాద్ పోలీసులు

ఓ విదేశీ యువకుడు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లోకి దూకడం కలకలం రేపింది. 2026 ఆగస్టు 26న ఉదయం సాగర్ లోకి దూకి ఆత్మహత్య యత్నించాడు. అక్కడే ఉన్న సైఫాబాద్ పోలీసులు తాడు సాయంతో యువకుడిని రక్షించారు. 

సెక్రటేరియట్ ముందు జరిగిన ఈ  ఘటన ఆందోళనకు గురిచేసింది. యువకుడిని సుడాన్ దేశానికి చెందిన ఏడీ డ్రిల్ గా గుర్తించారు పోలీసులు. తదుపరి విచారణ నిమిత్తం లేక్ పోలీసులకు అప్పజెప్పారు. 

ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై. లేక్ పోలీసులు ఆరా తీసుస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.