ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. ‘వన మహోత్సవం’లో అధికారులు, నాయకుల పిలుపు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. ‘వన మహోత్సవం’లో అధికారులు, నాయకుల పిలుపు

నెట్​వర్క్, వెలుగు :  భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు పిలుపునిచ్చారు. 

‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో, యాదాద్రి జిల్లా తాజ్​పూర్​లో అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి వారు వేర్వేరుగా మొక్కలు నాటారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించి అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 

సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో నిర్వహించిన వనమహోత్సవంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మొక్కలు నాటారు. శుభకార్యాలు, పుట్టినరోజుల సందర్భాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.