చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. 12 రాశుల వారికి జరిగేది ఇదే..!

చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. 12 రాశుల వారికి జరిగేది ఇదే..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈఏడాది ( 2026) రాఖీ పండుగ,  శ్రావణ పౌర్ణమి  ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం .. భారతదేశంలో కనపడకపోయినప్పటికి  గ్రహణం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. గ్రహణ ప్రభావం 42 రోజులు ఉంటుందని పండితులు చెబుతున్నారు. కుంభరాశి.. శతభిషా నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .! 

మేష రాశి:  ఈ రాశి వారికి చంద్ర గ్రహణం ప్రభావం చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఆర్థికంగా  బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి.  ముఖ్యంగా వ్యాపారులకు ఆదాయం పెంచుకునే మార్గాలు కనిపిస్తాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వారి వల్ల మీరు లాభాపడతారు. అయితే వచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్త వహించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

వృషభరాశి :ఈ  రాశి వారికి  చంద్రగ్రహణం ప్రభావంతో ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తాయి.  వృత్తి, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ఆర్థిక పరిస్థితి బలపడవచ్చని చెబుతున్నారు. గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

మిథునరాశి :ఈ  రాశివారికి ఈ గ్రహణ ప్రభావం వలనవిదేశీ అవకాశాలు, దూర ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఆర్థికంగా చాలా పురోగతి ఉంటుంది.  ఉద్యోగం, వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమాచారం అందే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు, పెట్టుబడులు లేదా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాల విషయంలో ముందడుగు వేసే పరిస్థితి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కర్కాటకరాశి :  ఈ రాశి వారికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  ప్రతి పనిలో కూడా సమస్యలు.. అడ్డంకులు ఏర్పడుతాయి. మీ కృషికి ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఖర్చులు పెరగవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా అనిపించవచ్చు. కుటుంబ ఉద్రిక్తతలు, ప్రియమైనవారితో విభేదాలు పెరగవచ్చు. మానసిక అస్థిరత , నిద్ర లేకపోవడం కూడా ఆందోళన కలిగించవచ్చు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

సింహ రాశి :  ఈ రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం వలన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.  ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు.  ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.  కొత్త వస్తువులు కొనే కార్యక్రమాన్ని వాయిదే వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.  మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.  ఆఫీసులో, వ్యాపారంలో ఒడిదుడుకులు సంభవించవచ్చు. సహోద్యోగులతో విభేదాలు పెరగవచ్చు. శత్రువులు ఇబ్బందులకు గురిసే అవకాశం ఉంది.  సంబంధాలు దెబ్బతింటాయి. కడుపు సమస్యలు, రక్తపోటు సంబంధిత సమస్యలు ఉండవచ్చు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

►ALSO READ | పొయెట్రీ కార్నర్: పైదాయిషీ భువనగిరి

కన్య రాశి :  ఈ రాశి వారికి ఆగస్టు 28 ఏర్పడే చంద్ర గ్రహణం ఆరవ స్థానానికి సంబంధించిన ప్రభావాలను సూచిస్తోంది.  కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది.  పోటీ పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార పోటీ వంటి అంశాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఆర్థిక వివాదాలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగులు తమ పనితీరుతో గుర్తింపు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆదాయ ప్రవాహం మెరుగుపడటంతో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. . ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరగడంతో అన్ని ఫలితాలు అనుకూలపరిస్థితులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

తులా రాశి :  ఈ రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం మిశ్రమ ఫలితాలు  ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. చాలాకాలంగా పూర్తి కాకుండా ఉన్న పనులు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన విషయాల్లో ఆటంకాలు ఏర్పడినా.. చివరకు పురోగతి కనిపించవచ్చని అంటున్నారు. కోర్టు లేదా ఇతర న్యాయపరమైన వ్యవహారాల్లో ఉన్న వారికి అనుకూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.పూర్వీకుల ఆస్థి కలిసి వస్తుంది.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కుటుంబంలో ఆనందం పెరగవచ్చని చెబుతున్నారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వృశ్చికరాశి : ఈ  రాశి వారికి చంద్రగ్రహణం వలన చాలా అద్భతంగా ఉంటుంది.  ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. గ్రహణం తరువాత 40 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చేసే వారు శుభవార్త వింటారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలమని పండితులు చెబుతున్నారు.ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది.   కొంతమంది మీ పని పట్ల అసూయ కలిగే అవకాశం ఉన్నందున తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

ధనుస్సురాశి : ఈ రాశి వారికి  చంద్రగ్రహణ ప్రభావంతో  ఆర్థికంగా అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య విశ్వాసం. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారికి కూడా పరిస్థితులు అనుకూలంగా మారవచ్చని  పండితులు అంచనా వేస్తున్నారు.  సమాజంలో పేరు, ప్రతిష్ఠ పెరగడంతో పాటు వృత్తిపరంగా గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఆర్థిక, కుటుంబ, సామాజిక అంశాల్లో సానుకూల మార్పులు కనిపించవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మకరరాశి :ఈ రాశి వారికి చంద్ర  గ్రహణ ప్రభావం ప్రతికూల పరిస్థితులను కలుగజేసూ  సూచనలు ఉన్నాయి.   ఆదాయం కంటే ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు .. వాహనా రిపేర్లు ఇలా అనుకోకుండా  ఖర్చులు పెరుగుతాయి. ఆస్తివివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 
ప్రతి విషయంలో కూడా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో అవమానాలు కలుగుతాయి.  ఆఫీసులో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి.  వీలైనంతవరకు అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లోనూ కొద్దిగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. అందుకే ఈ రాశి వారు రానున్న 4 నెలల పాటు ఈ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి.

కుంభ రాశి :ఈ  రాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆరోగ్యం, ఉద్యోగం, లక్ష్యాలు, ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో ఆరోగ్యపరమైన విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడులతో పాటు లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని పండితులు చెబుతున్నారు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

మీనరాశి: ఈ రాశి వారికి  గ్రహణ ప్రభావంతో ఒక్కసారిగా ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థికంగా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి,  నూతన ఉద్యోగానికి ప్రయత్నించే వారికి విదేశీ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలతో ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారులు, వృత్తి నిపుణులకు కూడా కొత్త అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉంది. సరైన సమయంలో సుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం