రామచంద్రాపురం, వెలుగు: పటాన్‌చెరు వరకు మంజూరైన మెట్రో రైల్‌ను సంగారెడ్డి వరకు పొడిగించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అధికారులను కోరారు. సోమవారం మెట్రో రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్అహ్మద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పలు కీలక సమస్యలపై ఈ సందర్భంగా ఎంపీ చర్చించారు.
అనంతరం మాట్లాడుతూ సంగారెడ్డి నుంచి లింగంపల్లి, హైదరాబాద్ వైపు నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారని మెట్రోను పొడిగిస్తే ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 నుంచి ఎగ్జిట్ 4 మధ్య సుల్తాన్‌పూర్‌వద్ద సర్వీస్‌రోడ్డు పెండింగ్‌లో ఉందని రోడ్డు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎండీ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు ఎంపీ తెలిపారు.
