కాచిగూడ–అశోకాపుర్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళ్లల్లో మార్పులపై కీలక అప్ డేట్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. 12785/12786 రైళ్ల వేళల్లో ఎలాంటి మార్పు లేదని 2026 ఆగస్టు 26న ప్రకటించింది.
రైలు వేగం పెంచుతూ గతంలో చేసిన ప్రతిపాదన ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఆపరేషనల్ కారణాలతో ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది.
12785 నెంబరు కాచిగూడ–అశోకాపురం ఎక్స్‌ప్రెస్ పాత సమయాలే కొనసాగుతాయని పేర్కొంది. 12785 రైలు కాచిగూడలో సాయంత్రం 7.05 గంటలకు బయలుదేరనుంది. మరుసటి రోజు ఉదయం 9.55 గంటలకు అశోకాపురం చేరుకుంటుంది.
►ALSO READ | కళ్ల ముందే నా భార్య చనిపోయింది.. సూర్యాపేట బస్సు ప్రమాద బాధితుడి ఆవేదన.. ప్రమాదానికి కారణం అతడే!
12786 నెంబరు అశోకాపురం–కాచిగూడ ఎక్స్‌ప్రెస్ వేళల్లోనూ మార్పు లేదని తెలిపింది. అశోకాపురంలో మధ్యాహ్నం 2.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రైలు సమయాల లేటెస్ట్ సమాచారం కోసం NTES, RailOne యాప్‌ను పరిశీలించాలని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
