మన మార్కెట్లు ముందుకే.. కంపెనీల ఆదాయాలు బాగున్నాయ్..పీఎల్ అసెట్ మేనేజ్మెంట్ రిపోర్ట్

మన మార్కెట్లు ముందుకే..  కంపెనీల ఆదాయాలు బాగున్నాయ్..పీఎల్ అసెట్ మేనేజ్మెంట్ రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు: పశ్చిమాసియాలో ఘర్షణల వంటి భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నా, మన ఎకానమీ బలంగా ఉందని ప్రభుదాస్​ లీలాధర్​(పీఎల్​) అసెట్ మేనేజ్​మెంట్​ తాజా రిపోర్ట్​ స్పష్టం చేసింది. దీని ప్రకారం.. చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నా  కంపెనీల బలమైన ఆదాయాలు, క్రెడిట్ వృద్ధి మార్కెట్లకు మద్దతు ఇస్తున్నాయి.  

దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 37 నెలల్లో షేర్లు కొని రికార్డు సృష్టించారు. ఎఫ్​ఐఐలు సైతం తిరిగి వస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు భారీగా పెట్టుబడులను ఆకర్షించాయి.

మొదటి క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు, కంపెనీల ప్రతిషేరు ఆదాయం (ఈపీఎస్​) మెరుగ్గా ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.3 శాతానికి చేరుకోగా, బ్యాంకు క్రెడిట్ విస్తరణ 17.7 శాతంగా నమోదైంది. జీఎస్టీ వసూళ్లు సైతం గరిష్ట స్థాయికి చేరాయని పీఎల్​ రిపోర్ట్​ వివరించింది.